కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామంలో రాయలసీమ విజయీభవ కార్యక్రమంలో టమోటా, బొప్పాయి పంటలు సాగు చేసిన రైతుల పొలాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మండల పార్టీ నాయకులతో కలసి పర్యటించి వారితో మాట్లాడటం జరిగింది.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాజన్న పాలన తీసుకువస్తాను అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, డ్రిప్పు, స్పింక్లర్లు ఏ ఒక్కటి కూడా రైతులకు ఇవ్వకుండా, దాంతో పాటు బీటీపీ పనులను ఆపేసి రైతులను జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచాడని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 10 జిల్లాలకు మేలు జరిగే అత్యంత గొప్ప పథకాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రుల చేత మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ ప్రారంభం కాబోతోందని, ఈ పథకానికి కేంద్రం 40 వేల కోట్లు ఇవ్వనుండగా, బ్యాంకులు మరో 60 వేల కోట్లు రుణంగా అందించనుందని దీంతో రాయలసీమ, అనంతపురంతో పాటు మన కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా మేలు జరుగుతుందని, బీటీపీ పథకానికి, వ్యవసాయ పరికరాలు, హార్టికల్చర్ పంటల కోసం, రోడ్ల కోసం నిధులు రానున్నాయని పేర్కొన్నారు..
మాములుగా మన ప్రాంతానికి ఎలాంటి నీటి వనరులు లేవు కేవలం వర్షాదారం మీదనే ఆధారపడి పంటల సాగు చేస్తున్నామని అలాంటిది ఈ ఏడాది ఎల్ నినో కారణంగా మనకు మరింత ఎక్కువగా ప్రభావం పడిందని 2028 మార్చి నాటికి బీటీపీ పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇస్తామని అన్నారు.
