Latest Posts

నిర్దిష్ట కార్యాచరణతో అభివృద్ధి వైపు పయనిద్దాం: ఎమ్మెల్యే కాలవ

  • నిర్దిష్ట కార్యాచరణతో అభివృద్ధి వైపు పయనిద్దాం: ఎమ్మెల్యే కాలవ
  • రాయదుర్గంలో స్వర్ణ ఆంధ్ర రాయదుర్గం కార్యాలయం ప్రారంభం
  • నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

రాయదుర్గం పట్టణంలో సోమవారం స్వర్ణ ఆంధ్ర రాయదుర్గం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2047 లక్ష్యంగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు ఈ కార్యాలయం మూల కేంద్రం కానుందన్నారు. 2047 నాటికి ఏ నియోజకవర్గానికి తీసిపోని విధంగా వెనుకబడ్డ రాయదుర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.

అందుకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. రాష్ట్ర సగటు కంటే వెనుకబడ్డ శాఖలపై ప్రతి నెల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తామని, వెనుకబాటుకు కారణాలు తెలుసుకుని దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలతో అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు రూ.లక్ష కోట్లతో హబ్ ఏర్పాటు చేయబోతున్నారని, అందులో రూ.30 వేల కోట్ల కార్యాచరణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో అక్టోబర్ 2న మదనపల్లిలో హబ్‌ను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఆ హబ్‌లో రాయదుర్గం భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ప్రస్తుత నీటి లభ్యతతో పాటు జీడిపల్లి, బైరవానితిప్ప ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుని పండ్ల తోటలను విస్తరించడంతో పాటు మేకలు, గొర్రెలు, పశువులు, కోళ్ల పెంపకం, గార్మెంట్స్ రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

Posted Under AP
Editor