రాయదుర్గానికి 25న మంత్రి నారా లోకేష్ రాక- పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎస్పీ జగదీష్.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఈ నెల 25న రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో 300 మెగావాట్ల సుజలాన్ కంపెనీ ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం కనేకల్లు క్రాస్ సభాస్థలిని సందర్శించారు. జిల్లా ఎస్పీ జగదీష్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటన కొనసాగే ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభా వేదిక, స్టాల్స్, పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ అధికారులకు సూచించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వన్నారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు లాలేప్ప, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ రాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి,అది, బసవరాజు,బిటి రమేష్,చాంద్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
