Latest Posts

గౌతమ బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలి — లేదంటే దేశవ్యాప్త ఉద్యమం: సత్యారెడ్డి హెచ్చరిక

గౌతమ బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలి — లేదంటే దేశవ్యాప్త ఉద్యమం: సత్యారెడ్డి హెచ్చరిక
ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిర్వహించిన భారీ ధర్నా కార్యక్రమంలో కింగ్ బుద్ధ హాలీవుడ్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి గారు గౌతమ బుద్ధుని జయంతిని ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) లాగే దేశవ్యాప్తంగా సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతానని స్పష్టం చేశారు.
బుద్ధ జయంతి సందర్భంగా సత్యారెడ్డి ఆధ్వర్యంలో “చలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయితలు బొర్రా గోవర్ధన్, సీతారామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల నుండి బౌద్ధ సంఘాల నాయకులు, బంతిజీలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సత్యారెడ్డి గారి ప్రసంగం:
సత్యారెడ్డి మాట్లాడుతూ— విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధనౌకర, విప్లవకవి గద్దర్ అన్నతో కలిసి “ఉక్కు సత్యాగ్రహం” సినిమా నిర్మించి ప్రైవేటీకరణను అడ్డుకున్న అనుభవం తనకు ఉందని తెలిపారు. గద్దర్ గారి ద్వారా బుద్ధిజానికి ఆకర్షితుడై, ప్రస్తుతం ప్రపంచస్థాయిలో “కింగ్ బుద్ధ” అనే భారీ హాలీవుడ్ చిత్రాన్ని 100 భాషల్లో నిర్మిస్తున్నానని చెప్పారు.
ఈ సినిమా ద్వారా గౌతమ బుద్ధుని శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందించడమే తన లక్ష్యమని, ఇరాన్–ఇజ్రాయిల్, రష్యా–ఉక్రెయిన్ వంటి యుద్ధాలు ఆగి, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలంటే బుద్ధుని మార్గాన్ని ప్రపంచం అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది బుద్ధుని మార్గంలో నడుస్తున్నప్పటికీ, బుద్ధుని జన్మస్థలం అయిన భారతదేశంలో బుద్ధ జయంతి సంపూర్ణ నేషనల్ హాలిడేగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజిటెడ్ హాలిడేగా ఉన్నప్పటికీ, ఆగస్టు 15, జనవరి 26 లాగే అన్ని రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థల్లో పూర్తిగా అమలు కావడం లేదని విమర్శించారు.
ఈ హక్కు సాధన కోసం దేశవ్యాప్తంగా బౌద్ధ సంఘాలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని తెలిపారు.
ముఖ్య అతిథుల అభిప్రాయాలు:
బొర్రా గోవర్ధన్ మాట్లాడుతూ— బహుజన రాజ్యాధికారం గౌతమ బుద్ధుని ఆశయమని, అది సాధించినప్పుడే ఇలాంటి నేషనల్ హాలిడేలు సాధ్యమవుతాయని అన్నారు. ఈ పోరాటంలో సత్యారెడ్డికి చివరివరకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు.
సీతారామయ్య మాట్లాడుతూ— గద్దర్ అన్నతో కలిసి ఉద్యమాలు చేసిన సత్యారెడ్డి గారు ఈ డిమాండ్ సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాను సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఈ కార్యక్రమంలో అనేక రాష్ట్రాల నుండి వచ్చిన బౌద్ధ సంఘాల నాయకులు, కవులు, కళాకారులు, సినీ ప్రముఖులు, మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor