పెద్దకోట్లలో టిబి ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం..

తాడిమర్రి(yes9tv)పెద్దకోట్లలో టిబి ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం
తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామంలో ఈరోజు టిబి ముక్త్ భారత్ కార్యక్రమం భాగంగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు, 2030 నాటికి క్షయ వ్యాధి రహిత సమాజం సాధించాలనే లక్ష్యంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
తాడిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పెద్దకోట్ల HWC కేంద్రంలో నిర్వహించిన ఈ శిబిరంలో మొబైల్ హ్యాండిల్ డిజిటల్ ఎక్స్-రే సదుపాయం అందుబాటులో ఉంచారు. PHC వైద్యాధికారి డాక్టర్ హరిత మార్గదర్శకత్వంలో, వైద్య సిబ్బంది మరియు క్షయ వ్యాధి నియంత్రణ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ శిబిరంలో క్షయ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అనుమానిత రోగులకు ఉచితంగా ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు. మొత్తం 102 మందికి డిజిటల్ ఎక్స్-రే పరీక్షలు చేయబడినవి.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, నిర్ధారణ అయిన రోగులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఆరు నెలల పాటు మందులు మరియు పోషకాహారం అందించబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామ్ కుమార్, ఆరోగ్య కార్యకర్త జానకి రాము, MLHPs ఉమాదేవి, విజయలక్ష్మి, అలేఖ్య, ANMs రమాదేవి, రేష్మ, అలాగే ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor