అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ మహిళ బస్సు కోసం వెయిట్ చేస్తూ బస్సు రాకపోవడంతో ఆందోళనకు దిగింది. బస్సు బస్టాండ్‌లో రాకుండా బయట నుండే వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టడం వల్ల డ్రైవర్లకి, కండక్టర్లకి మహిళలు అంటే చులకన అయిపోయిందని, ఫ్రీ బస్ తీసివేయండి, మాకు టికెట్ కొనే స్తోమత ఉందని ఆందోళనకు దిగింది. ఇలా మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఈ డ్రైవర్లకు, కండక్టర్లకు మహిళలంటే చాలా చులకనగా చూస్తున్నారని లెక్కలేకుండా పోయిందని చెప్తూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఫ్రీ బస్సు తీసివేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.
బస్సుల నిలిపివేతపై అనంతపురం జిల్లా గుత్తిలో మహిళా ప్రయాణికురాలి వినూత్న నిరసన
