డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు శ్రీ వైయస్‌ జగన్‌ ఘన నివాళులు..

విజయవాడ,తాడేపల్లి.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు శ్రీ వైయస్‌ జగన్‌ ఘన నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్భంగా వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రద్దాంజలి ఘటించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించిన శ్రీ వైయస్‌ జగన్‌ ఆయనకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ పబ్లిసిటీ వింగ్‌ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, వేమూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబుతో పాటు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor