Latest Posts

హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు.. ట్రాఫిక్ ఆంక్షలు

ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. గత నెల 19, 20వ తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లకు అర్ధాంతరంగా వాయిదా వేశారు.

అంతకుముందు ప్రాక్టీస్‌లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రేస్ పోటీలు నిర్వహించలేదు. అప్పుడు ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇండియన్ రేస్ లీగ్ వెనక్కి ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే మరోసారి కార్ రేసింగ్ పోటీలు నిర్వహించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 9 నుంచి 11 వరకు కార్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. దీంతో ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌ రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

► ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్‌ కోజ్

► బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు ప్రవేశంలేదు

► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు అనుమతి లేదు

► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు నో ఎంట్రీ

► ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు రోడ్స్ మూసివేత

► బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు

► ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ రూట్ మూసివేత

► ఎన్టీఆర్ గార్డెన్, ఎన్‌టీఆర్‌ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్లు మూసివేత

Editor