Latest Posts

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ మీదుగా అల్పపీడన ప్రాంతం

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ మీదుగా అల్పపీడన ప్రాంతంగా గుర్తించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అల్పపీడనంగా కేంద్రీకరించే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.

క్రమంగా ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారి.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర ఆంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Editor