Latest Posts

కందుకూరుపల్లి సమీపంలో పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

కందుకూరుపల్లి సమీపంలో పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

అమడగూరు: శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండల పరిధిలోని కందుకూరుపల్లి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మహ్మదాబాద్ నుంచి కందుకూరుపల్లి గ్రామానికి బొలెరో వాహనంలో వెళ్తున్న సమయంలో రోడ్డుపై పులి అడ్డంగా నిలబడినట్లు ప్రత్యక్షంగా చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
అనుకోకుండా రోడ్డుపై పులి కనిపించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను తీసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో గ్రామస్థుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు తెలిపారు.
పులి సంచరిస్తున్నట్లు సమాచారం వెలువడటంతో కందుకూరుపల్లి, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పులి సంచారంపై పరిశీలన చేపట్టి, ప్రజలకు తగిన సూచనలు జారీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Posted Under AP
Editor