Latest Posts

పోరుమామిళ్ల మద్దిమాను గురప్ప స్వామి దేవస్థానంలో ఆరేళ్ల అవినీతిపై విచారణకు ఆదేశం..

Yes 9 TV జిల్లా …. కడప సెంటర్…పోరుమామిళ్ల తేదీ….. 21-11-2026 రిపోర్టర్… ఎస్.గురుస్వామి

వైఎస్ఆర్ కడప జిల్లా, పోరుమామిళ్ల మండలం, గురప్పగారిపల్లె సగిలేరు ఒడ్డున వెలిసిన శ్రీ శ్రీ మద్దిమాను గురప్ప స్వామి దేవస్థానంలో గత 6 సంవత్సరాలుగా జరిగిన అవినీతి పై ప్రభుత్వం ఎట్టకేలకు విచారణకు ఆదేశించింది. భక్తులు, పాలకమండలి సభ్యులు ఇచ్చిన పిర్యాదుల ఆధారంగా, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రభుత్వం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిణి విచారణ అధికారిగా నియమించింది. దేవస్థానం ప్రధాన పూజారి వేణు స్వామి, క్లర్క్ రామకృష్ణ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే…ఈ ఇద్దరితోపాటు పోలేరమ్మ పూజారి శేఖర్ పై కూడా అభియోగాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాలపై విచారణ అధికారి దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ జనార్ధన్ ను వివరణ కోరగా…వీరిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం వాస్తవమే అన్నారు. భక్తులనుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు వేయించుకోవడం, కళ్యాణకట్ట కూల్చడం, అభిషేకాలు, అర్చనల టికెట్లలో గోలమాల్, దేవస్థానం రూముల బాడుగల్లో తప్పుడు రికార్డులు చూపడం లాంటి అభియోగాలను వీరు ఎదుర్కొంటున్నారు అన్నారు. వీరితోపాటు గత ఆరు సంవత్సరాల కాలంలో ఈ దేవస్థానంలో పని చేసి వెళ్లిన ఈవోలు శోభారాణి, నరసయ్య, రామలింగారెడ్డి, వెంకటసుబ్బయ్య లను కూడా విచారించడం జరుగుతుంది అన్నారు.

Posted Under AP
Editor