Latest Posts

కడప జిల్లా పోరుమామిళ్లలో జనసంద్రాన్ని తలపించిన షేక్ అర్షియా సర్పంచ్ నామినేషన్ ర్యాలీ.

*జనసంద్రాన్ని తలపించిన అర్షియా నామినేషన్* .కడప జిల్లా, పోరుమామిళ్ల, నవంబర్ 17 : పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ అర్షియా నామినేషన్ కు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఉప్పెనలా తరలి వచ్చారు. స్థానిక వైఎస్ఆర్సీపి కార్యాలయంనుండి పంచాయితీ కార్యాలయం వరకు నిర్వహించబడిన భారీ ర్యాలీ జన సంద్రాన్ని తలపించింది. ఎన్నికల రథసారథి దేవసాని ఆదిత్య రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి, రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పార్టీ మండల అధ్యక్షులు సీఎం భాషతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు వెంటరాగా షేక్ అర్షియా పోరుమామిళ్ల మేజర్ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఎంఎల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ… అర్షియా విజయం తప్పదు అన్నారు. అర్షియా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, అభిమానులు ముందుకు పోవాలన్నారు. గెలుపు అనంతరం పోరుమామిళ్ల మేజర్ పంచాయితీని ప్రజల అభీష్టం మేరకు అన్ని విధాల అభివృద్ధి చేస్తాం అన్నారు. పోరుమామిళ్ల గ్రామ పంచాయితీ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును షేక్ అర్షియాకు వేసి గెలిపించి పంచాయితీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.

Posted Under AP
Editor