Latest Posts

రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు…

శ్రీ సత్యసాయి జిల్లా…

పత్రికా ప్రకటన
తేదీ: 17-11-2026…

  • రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు…
  • నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ…
  • కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో ఎన్నికలు..
  • ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి:
  • జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు…

జిల్లాలో రెండో దశలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు తెలిపారు.

నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది, నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థులు, వారి అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నామినేషన్

Editor