విద్యార్థినిపై దాడి ఘటన తీవ్రంగా కలచివేసింది  –మాజీ ఆప్కాస్ బోర్డు మెంబర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

 

 

కడప జిల్లా, పోరుమామిళ్ల, నవంబర్ 01(ఎస్ 9TV):

అనంతపురము జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గోపికపై శనివారం జరిగిన అమానుష దాడి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, కలచివేసిందని మాజీ ఆప్కాస్ బోర్డు మెంబర్, పోరుమామిళ్ల డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. తరగతి గదిలో వున్న విద్యార్థినిపై దుండగుడు అకస్మాత్తుగా దూసుకువచ్చి కలప కోసే పెట్రోల్ రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం హృదయ విదారకమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని అన్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు, పోలీసుల అదుపులో వున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను కోరారు. ఇలాంటి అనాగరిక ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు.

Posted Under AP
Editor