ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అమిలినేని దంపతులు..

సెంటర్ కళ్యాణదుర్గం

 

ఫైల్ నేమ్:-

ATP-KLD 011126 MLA VOTE

 

  • ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అమిలినేని దంపతులు
  • సతీమణి రమాదేవితో కలిసి 31/1 పోలింగ్ బూత్‌లో ఓటు\
  • అభివృద్ధిని కోరుకుంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నారన్న ఎమ్మెల్యే

 

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన సతీమణి రమాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని స్త్రీ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన 31/1 పోలింగ్ బూత్‌లో దంపతులు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణదుర్గం అభివృద్ధిని కోరుకుంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నారని అన్నారు.

 

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా స్త్రీ శక్తి భవనంలోని 31/1 పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన సతీమణి రమాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు వేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ అభివృద్ధిని కోరుకుంటూ తండోపతండాలుగా ఓటు వేస్తున్నారని అన్నారు. ఉదయం 11 గంటల సమయానికి 33 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 2019 నుంచి 2024 వరకు కళ్యాణదుర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఆ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor