కర్నూలు జిల్లా..
హోలగుంద మండలం…
రక్త తర్పణం..
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో 80 మందికి గాయాలు..
తొక్కిసలాటలో ఆలూరుకు చెందిన పోతురాజు మృతి…
కర్నూలు జిల్లా దేవరగట్టు లో దసరా పండుగ సందర్బంగా జరిగిన బన్ని ఉత్సవంలో దేవునికి రక్త తర్పణం జరిగింది. నెరనికి, కొత్తపేట, నెరనికి తాండ గ్రామాల ప్రజలు, ఆలూరు, అరికెర, సులువాయి, బిలేహాల్, వీరుపాపురం. గ్రామాలు మరో వైపుగా సాగిన కర్రల సమరంలో దేవరగట్టు అల్లకల్లోలం అయ్యింది. అర్ధరాత్రి 12.30 గంటలకు కొండపైకి చెరుకున్న భక్తులు శ్రీ మాళ మల్లేశ్వర స్వాములకు కళ్యాణం జరిపి కిందకు దిగగా సింహాసనం కట్ట దగ్గర అగ్గి దివిటీలు, కర్రలు కొద్ది సేపు గాల్లో నృత్యం ఆడాయి. అనంతరం పల్లకి, దేవతామూర్తి విగ్రహాలను ఎదురు బసవన్న గుడికి చేరుకునేలోపు మరోసారి రాళ్లు, అగ్గి దివిటీలు గాల్లోకి లేచాయి. తొక్కిసలాటలో ఆలూరుకు చెందిన పోతురాజు మృతి చెందాడు.దాదాపు గంటసేపు ఇరు వర్గాలు రాళ్లు, అగ్గి చువ్వలు విసురుకున్నారు. జిల్లా ఎస్పీ స్వయాన ఉన్నా ఇరు వర్గాలను ఏమి చేయలేకపోయారు. అనంతరం బేటాలియాన్ పోలీసులు రంగప్రవేషం చేసి ఇరు వర్గాలను సర్దిచెప్పారు. కర్రల సమరంలో చాలా మంది కి తీవ్ర గాయాలు కాగా ఐదుమందికి పైగా ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది.
