Latest Posts

మనెకుర్తి పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్..

కర్నూలు జిల్లా…

మనెకుర్తి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన… కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు.

ఎన్నికల నేపథ్యంలో ఆలూరు మండలం , మనెకుర్తి గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, మౌలిక వసతులను పరిశీలించి, ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆదోని ఏఎస్పీ జయశర్మ ఐపీఎస్, పత్తికొండ డిఎస్పి వంశీధర్ గౌడ్ ,సీఐలు మధుసూదన్ రావు, కేశవరెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం – కర్నూలు

Posted Under AP
Editor