బన్నీ ఉత్సవం నేపథ్యంలో కార్డన్ సెర్చ్ – 83 రింగ్ స్టిక్స్ మరియు 01 గండ్ర గొడ్డలి స్వాధీనం

కర్నూలు జిల్లా,, ఆలూరు లో
బన్నీ ఉత్సవం నేపథ్యంలో కార్డన్ సెర్చ్ – 83 రింగ్ స్టిక్స్ మరియు 01 గండ్ర గొడ్డలి స్వాధీనం

2026 వ సంవత్సరం అక్టోబర్ నెల 21 వ తేదీన దేవరగట్టు లో జరుగబోవు, బన్నీ ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్, IPS గారి ఆదేశాల మేరకు, పత్తికొండ SDPO గారి పర్యవేక్షణలో, ఈ రోజు అనగా 06.10.2026 వ తేదీన వేకువ జామున ఆలూరు మండలం అరికెర గ్రామంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. పత్తికొండ సబ్-డివిజన్ పరిధిలోని CIలు, SIలు మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి సుమారు 83 రింగ్ స్టిక్స్ మరియు 01 గండ్ర గొడ్డలి ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు బన్నీ ఉత్సవం సందర్భంగా రింగ్ స్టిక్స్ తో పరస్పరం కొట్టుకోవడం, గొడవలకు పాల్పడటం, ఆయుధాలు వినియోగించడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడరాదని పోలీసులు అవగాహన కల్పించారు.

బన్నీ ఉత్సవం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని పత్తికొండ SDPO గారు తెలిపారు.

SDPO, పత్తికొండ సబ్-డివిజన్

Posted Under AP
Editor