- ముదిగుబ్బలో స్ట్రైకర్స్ హాకీ క్లబ్ ప్రారంభం
- సేవా.. క్రీడా.. స్నేహం.. ఇదే మా ఆశయం: ఆర్డీటీ
ముదిగుబ్బ, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్డీటీ సహకారంతో స్ట్రైకర్స్ హాకీ క్లబ్‌ను శుక్రవారం ప్రారంభించారు. కూటమి నాయకులు, పాఠశాల అధికారులు కలిసి క్లబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు. హాకీ జాతీయ క్రీడ అని, ముదిగుబ్బ నుంచి కూడా మంచి క్రీడాకారులు రావాలనే లక్ష్యంతో క్లబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండి మైదానాల్లో క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రకాష్, టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ మనోహర్, ఎంఈఓ రమణప్ప, ప్రధానోపాధ్యాయులు రమాదేవి, ఆర్డీటీ హాకీ ఇన్చార్జ్ నల్లపరెడ్డి, సీనియర్ కోచ్ చౌడేశ్వరి ప్రసాద్, కోచ్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.
