ముదిగుబ్బ, మండలంలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి జె. శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హౌసింగ్, విద్య, గ్రామ సచివాలయాలు, పారిశుధ్యం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. ప్రజల సమస్యలను అధికారులు స్నేహభావంతో తెలుసుకుని, స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. తమ పరిధికి మించిన సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.
మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి పారిశుధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలును పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
సమావేశంలో ఎంపీడీవో హాజీ వలి సాహెబ్, డీఆర్ మంజులాదేవి, జీఎస్‌డబ్ల్యూఎస్‌టీ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో కే. గోపాల్, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర, ఎంఈఓ రమణప్ప తదితర అధికారులు పాల్గొన్నారు. సుమారు 36 మంది అధికారులు హాజరయ్యారు.
అధికారుల సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి…
