Latest Posts

వీఆర్డీల డిమాండ్లను పరిష్కరించాలి….

  • వీఆర్డీల డిమాండ్లను పరిష్కరించాలి
  • డిమాండ్ల సాధన కోసం వీఆర్డీల నిరవధిక సమ్మె

ముదిగుబ్బ,రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్డీల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్డీ సంఘం మండలాధ్యక్షుడు ఓబులపతి కోరారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్డీలు ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు.
ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం వీఆర్డీలు సమ్మె నిర్వహించారు. తెలంగాణ తరహాలో వీఆర్డీలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్డీలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
మరణించిన వీఆర్డీల స్థానంలో వారి నామినీలను వీఆర్డీలుగా నియమించాలని, వాచ్‌మెన్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్ పోస్టుల్లో అర్హులైన వీఆర్డీలకు అవకాశం కల్పించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని వీఆర్డీలు స్పష్టం చేశారు.

Posted Under AP
Editor