మలకవేములలో ఆశా కార్యకర్త పోస్టు ఖాళీ
ముదిగుబ్బ మండలం మలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లేపల్లి–1 స్వర్ణగ్రామం, టి.ఎన్.పాలెం గ్రామంలో ఆశా కార్యకర్త పోస్టు ఖాళీగా ఉంది.
ఈ పోస్టుకు అర్హులైన మహిళల నుంచి సెప్టెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థుల వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. సంబంధిత గ్రామంలో నివసించే మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది.
అర్హత ఉన్న మహిళలు నిర్ణీత తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వైద్యాధికారి తెలిపారు.
మలకవేములలో ఆశా కార్యకర్త పోస్టు ఖాళీ..
