గుంజేపల్లి భూముల్లో ప్లాట్ల ఏర్పాటు..

గుంజేపల్లి భూముల్లో ప్లాట్ల ఏర్పాటు
ముదిగుబ్బ: మండలంలోని గుంజేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 929-ఏ, 929-13-ఏ, 929-14-3లో ఉన్న భూముల సమీపంలో సుమారు 2.50 ఎకరాల స్థలాన్ని కొందరు వ్యక్తులు చదును చేసి ప్లాట్లు వేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
ఈ విషయంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసి, అక్కడ ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.
2.50 ఎకరాల స్థలాన్ని అనర్హులకు కేటాయించకుండా, గ్రామంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని వారు కోరారు.

Posted Under AP
Editor