నేపాల్‌లో విషాదం.. 930 మందికి పైగా సొరంగాల్లో చిక్కుకున్నట్లు అంచనా

భీకర జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వరదల ధాటికి నేపాల్ సరిహద్దులోని పలు హైడ్రో ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.

హైడ్రో ప్రాజెక్టుల సొరంగాల్లో 930 మందికి పైగా సిబ్బంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నేపాల్ ఆర్మీ నిరంతరం సహాయక చర్యలు చేపడుతోంది. ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రహదారులు, భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,200 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో దాదాపు 500 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Editor