ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలంలోని ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిగుబ్బ తహసీల్దార్‌తో కలిసి పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, వారికి కల్పించిన చట్టపరమైన రక్షణలు, సంబంధిత చట్టాలపై కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు. తమ హక్కులను తెలుసుకుని, ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
