కనేకల్ మండలం కనేకల్ క్రాస్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారికి గల సమస్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ తో మరియు సిబ్బందితో మాట్లాడి పాఠశాల నందు ఉన్న సమస్యలపై చర్చించారు. పాఠశాలలో నీటి సమస్య అధికంగా ఉన్నదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే నీటి సమస్యను పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. డ్రైనేజీ సమస్యకు కమ్యూనిటీ షోక్ పిట్ ఉపయోగించుకోవాలన్నారు. కార్యాలయ సిబ్బందికి సకాలంలో జీతాలు అందుతున్నాయా అని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. తదనంతరం పిల్లలతో పాటు కాసేపు వరండాలో కూర్చొని ముచ్చటిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆటలందు ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా విద్యార్థుల శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తహశీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ షేక్షావలి, ఆర్ఐ సందీప్, విఆర్ఓ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కనేకల్ క్రాస్ లో గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..
