మండలపరిధిలోని ఈదులపల్లి గ్రామంలో సోమవారం ఊరి దున్నపోతు దాడి చేయడంతో వ్యక్తి గాయపడ్డ సంఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల మేరకు ఈదులపల్లి గ్రామానికి చెందిన పెద్దగంగిరెడ్డి అనే వ్యక్తి వీధిలో వెళుతుండగా స్థానిక దున్నపోతు ఒక్కసారిగా దాడికి పాల్పడిందని,దీన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి దున్నపోతును అడ్డుకున్నారు. అనంతరం క్షతగాత్రున్ని ప్రత్యేక వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు.
