ఎల్‌నినో ప్రభావంతో నీటి వినియోగంపై రైతులు సహకరించాలని తెలిపిన ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగం సహృదయంతో సహకరించాలని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ఎల్‌నినో ప్రభావంపై అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కూడా చర్చ జరిగిందని తెలిపారు.

ప్రస్తుతం సీజీ ప్రాజెక్టు, పెద్దబల్లి రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఉన్నాయి, అదే విధంగా భూగర్భ జలాలలు తగ్గే ప్రభావం ఉందని పేర్కొన్నారు.

హంద్రీ–నీవా, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, భూగర్భ జలాలు మరింత తగ్గకుండా, బోరుబావుల్లో నీటి మట్టాలు పడిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కొత్త బోరుబావులు వేయడాన్ని కొంతమేర తగ్గించి, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రకృతి వైపరీత్యాలు సహజమే అయినప్పటికీ, ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.

విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు అండగా నిలిచే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

రాబోయే పది రోజుల్లో హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా చెర్లోపల్లి రిజర్వాయర్‌కు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని,తెలిపారు.

హంద్రీ–నీవా ప్రాజెక్టు మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులను నీటితో నింపే ప్రక్రియ కొనసాగుతోందని,ఇరిగేషన్ శాఖ మంత్రితో కూడా ఈ అంశంపై మాట్లాడతామని తెలిపారు.

ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి విషయంలో ఇబ్బందులు లేకుండా పరిష్కారం చూపే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగం ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

బైట్స్….

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

Posted Under AP
Editor