అక్రమార్కుల చేతుల్లోకి కోట్లాది రూపాయల విలువైన సొసైటీ స్థలం పట్టించుకోని అధికారులు

ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ, సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ pic జనార్ధన్ సందర్శనకు వచ్చిన సందర్బంగా…భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాలపాటి రామకృష్ణ మాట్లాడుతూ
మండల కేంద్రమైన ముదిగుబ్బ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన సొసైటీ స్థలం క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన ప్రభుత్వ/సొసైటీ ఆస్తిని పరిరక్షించాల్సిన అధికారులు నిద్రావస్థలో వ్యవహరిస్తున్నారని సొసైటీ ఖాతాదారులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముదిగుబ్బ మండల కేంద్రంలో సొసైటీకి గతంలో సుమారు 2.45 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొంత భాగం ఇప్పటికే ఆక్రమణలకు గురికావడంతో ప్రస్తుతం సుమారు 1.45 ఎకరాల స్థలం మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ స్థలంపై కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా కన్నేసి, యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని సొసైటీ ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.
ఐదు సెంట్ల స్థలంలో పక్కా భవనం
ఇప్పటికే ఒక వ్యక్తి సుమారు ఐదు సెంట్ల సొసైటీ స్థలాన్ని ఆక్రమించి పక్కా భవనం నిర్మించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ భవనం ద్వారా సంబంధిత వ్యక్తి లబ్ధి పొందుతున్నప్పటికీ, సొసైటీ స్థలాన్ని పరిరక్షించాల్సిన అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి ఆక్రమణకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో మిగిలిన స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు
సొసైటీ స్థలం ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు…

Posted Under AP
Editor