కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదేశీ పర్యటనకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఈ ఫోటోలో రాహుల్ గాంధీతో పాటు ఓ బాబు, ఓ మహిళ కనిపిస్తున్నారు. వీరంతా ఓ పడవలో ప్రయాణిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోపై తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ ఫోటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ రాహుల్ గాంధీని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? మీతో ఉన్న వ్యక్తులు ఎవరు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని తన పోస్టులో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ గత కొంతకాలంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి కొన్నిసార్లు ఎలాంటి సమాచారం లేకుండా విదేశాలకు వెళ్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటో నేపథ్యంలో గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి.
