ముదిగుబ్బ yes9TV
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన ఔదార్యంతో మరోసారి మానవత్వం చాటుకున్నారు. ముదిగుబ్బ మండలానికి చెందిన ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2.50 లక్షల చెక్ ను అందజేసి బాధితునికి భరోసానిచ్చారు. ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లి గ్రామ వాసి జాస్తి చంద్రశేఖర్ కి హృదయ సంబంధిత అనారోగ్యముతో బాధపడుతూ, ఓపెన్ హార్ట్ సర్జరీ కొరకై ఆర్థిక సాయాన్ని కోరగా కార్యకర్తల ద్వారా పరిస్థితిని గ్రహించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణమే స్పందించి, జాస్తి చంద్రశేఖర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను తన కార్యాలయంలో స్వయంగా బాధితునికి అందించి సహాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు, ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, ముదిగుబ్బ మండలం ఓబిసి మోర్చా అధ్యక్షులు వై చంద్రమోహన్, సత్యసాయి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు ఛత్రపతి యాదవ్,బిజెపి నాయకులు లక్ష్మీపతి నాయుడు. సర్పంచ్ వేణుగోపాల్. ముదిగుబ్బ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హృదయ రోగ బాధితునికి రూ.2.50 లక్షల చెక్కు అందజేసిన మంత్రి సత్య కుమార్..
