*అయ్యా ఆర్థిక మంత్రి ఉండబండ గ్రామాన్ని కాపాడండి *
*ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఉండబండ గ్రామస్తులు ఫిర్యాదు *
*పేకాట రాయుళ్ళపై చర్యలు చేపట్టండి..!*
*ఆ ఎస్ బి కానిస్టేబుల్ నరసింహలు పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు.*
ఎస్ 9 న్యూస్
ఉరవకొండ జులై 28
అనంతపురం జిల్లా బ్యూరో
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గం.విడపనకల్లుమండలం పరిధిలో ఉండబండ గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయం సమీపంలోని కాలువ గట్టుపై పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారని అధికారుల చర్యలు చేపట్టి తక్షణమే నిలుపుదల చేయాలని గ్రామానికి చెందిన కొందరు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి ఉండ బండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇదే ప్రాంతంలో వన్నూరుప్ప స /ప్ మారెప్ప,విధులను వస్తూ నిఘా వ్యవహారాలు చూడాల్సిన ఓ ఎస్ బి, కానిస్టేబుల్ నరసింహలు తో జతకట్టి ఇక్కడ పేకాట శిబిరాన్ని,నిర్వహిస్తున్నట్టుఫిర్యాదులో పేర్కొన్నారు ఆట ఆడటానికి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలతో పాటు తాడిపత్రి కళ్యాణదుర్గం హిందూపురం ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి జూదరులు వస్తున్నారని వివరించారు రాత్రి 10 గంటలకు మొదలు పెడితే పేకాట తెల్లవారుజామున 4 గంటలకు జరుగుతుందని రాత్రిపూట వాహనాలు చేయడం వల్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారని వివరించారు పేకాట ఆడే కి వచ్చేవాళ్లు తమ వాహనాలను వీరభద్ర స్వామి గుడి వద్ద నిలుపుడంతో భక్తులకు తీవ్ర అసద్కర్యంగా ఉందని తెలియజేశారు పేకాట ఆడేవారు డబ్బు పోగొట్టుకుంటే తక్షణమే అప్పు చెల్లించేందుకు ఫైనాన్సర్లు సిద్ధంగా ఉంటారని చెబుతూ ముగ్గురి పేర్లు చిరునామా మొబైల్ నెంబర్లను తెలియజేశారు. వారి పేర్లు :-అనంతపురం శ్రీనా,జాస్తి నాగరాజు అనంతపురం వీబర, నాగసముద్రం పుల్లయ్య, వీళ్లు ముగ్గురు కలసి పేకాట రాయులు శిబిరం దగ్గర అధిక వడ్డీలు నడుపుతూ తున్నారు. పేకాట ఆడడం మంచిది కాదని ఎవరైనా అడ్డు చెబితే భౌతిక దాడిలో దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానిక అధికారులకు తెలియజేసిన స్పందన లేకపోవడంతో మీకు ఫిర్యాదు చేస్తున్నామని వివరించారు డబ్బు పోగొట్టుకున్న వారిలో ఎస్సీ ఎస్టీలు ఉండడంతో ఆ వర్గం నేతలు ఈ సమస్యను ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఈ ఫిర్యాదు పై ఎటువంటి చర్యలు చేపడతారో వేసి చూడాల్సిందే.
ఉండబండ దేవాలయ పరిసరాల్లో ప్రాంతాలలో భక్తులకు అసౌకర్యం కలగడంతో పేకాటరాయల్ని నిలువరించలేని భక్తులు ఏగంగా సంబంధిత జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు పలు ఆధారాలు స్థానికుల వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. కాగా స్థానికులు ఫిర్యాదు మేరకు అధికారులు ఇటువంటివంతులు చర్యలు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ( మరింత సమాచారం రేపటి కథనములో మీ సాక్షి డిజిటల్ న్యూస్ లో ముందుకు వస్తాం)
