అనంతపురం జిల్లా- రాయదుర్గం
* అసత్యాలు పదేపదే వల్లెవేస్తున్న వైసీపీకి రాజకీయ సమాధి తప్పదు
* ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
అసత్యాల పునాదులపై ప్రారంభమైన వైసీపీ తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ నిజం చెప్పలేదని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీఎస్సీ పై వైసీపీ అసత్యాలు చెబుతుందని మండిపడ్డారు.
మంత్రి నారా లోకేష్ బాబు నాయకత్వంలో 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా భర్తీ చేశాం. JEE స్థాయి ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించాం. అయినా వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమాలు జరిగాయని ఆధారాలుంటే బహిరంగ చర్చకు రావాలని మంత్రి లోకేష్ పిలుపునిస్తే జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
జగన్ 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. 23 వేల పోస్టులు అంటూ ఎన్నికల ముందు ఉత్తుత్తి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తోంది. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా సర్కారు బడుల్లో చేరుతున్నారన్నారు.
అసత్య ప్రచారాలతో 16,347 మంది ఉపాధ్యాయుల ప్రతిభను అవమానిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గ ధోరణితో వైసీపీకి రాజకీయ సమాధి తప్పదు అని చెప్పారు.
పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడం జగన్ కు ఇష్టం లేదని, అందుకే విద్యా వ్యవస్థపై బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే కాలవ ఆరోపించారు.
ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని
ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
బైట్స్ : 1. కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్, రాయదుర్గం, అనంతపురం జిల్లా
