పేదలకు ఆర్థిక భరోసా సామాజిక పింఛన్ : ఎమ్మెల్యే కాలవ

దేశంలో ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే పింఛన్ దారుల ఇల్ల దగ్గరికి వెళ్ళి పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

రాయదుర్గం పట్టణంలో బుధవారం ఆయన ఇంటింటికి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తారీకు జీతం వచ్చినట్లు సామాజిక పెన్షన్ దారులకు అందుతోందన్నారు. పింఛన్ దారులకు ఆర్థిక భరోసా ఇస్తున్న ఒక పవిత్రమైన మంచి కార్యక్రమన్నారు. ఈ పవిత్రమైన యజ్ఞాన్ని చంద్రబాబు నాయుడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారన్నారు. ఆయనే స్వయంగా ప్రతినెలా ఎక్కడో ఒక చోట వెళ్లి పెన్షన్ దారులను కలిసి వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 25 నెలల కాలంలో ఎక్కడ కూడా ఒక్క విమర్శ కూడా లేకుండా లక్షల మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీ జరుగుతుంన్నారు.
చంద్రబాబు నాయుడు దర్శనికత, పరిపాలన దక్షతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పెద్దపీట వేస్తోందన్నారు. ఒక్క రాయదుర్గం పట్టణంలో ఈ రెండేళ్ల కాలంలో దాదాపు రూ.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మరో నెల రోజుల్లో రూ2.5 కోట్ల విలువైన పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. పట్టణంలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి, ఎన్నడు చూడనంత కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఒకవైపు పురపాలక శాఖ నారాయణ, మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతోదికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. రాయదుర్గం ప్రజల తరఫున వారికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, వార్డ్ ఇంఛార్జి పోరాళ్ల గౌరీ, కార్పొరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం, మాజీ డైరెక్టర్ టoకశాల హనుమంతు, మార్కెట్ యార్డ్ చైర్మన్ యు.హనుమంత రెడ్డి, అగ్రహారం కిరన్, బిడబ్బిడి శివ, వేణు,కొండాపురం శ్రీనివాసులు,మల్లి, ఆనంద్,తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor