Latest Posts

ముదిగుబ్బ కేజీబీవీలో ఘనంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం.. పాల్గొన్న ఎంపీపీ ఆది నారాయణ యాదవ్

ముదిగుబ్బ yes9TV
మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లో నిర్వహించిన “మన్ కీ బాత్” కార్యక్రమంలో ముదిగుబ్బ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) & బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గొడ్డుమర్రి ఆది నారాయణ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశాభివృద్ధి, యువత సాధికారత, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత మరియు “వికసిత్ భారత్ – 2047” లక్ష్యాలపై చేసిన సందేశాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలతో కలిసి శ్రద్ధగా వీక్షించారు.
అనంతరం శ్రీ గొడ్డుమర్రి ఆది నారాయణ యాదవ్ గారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యతలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వై. చంద్రమోహన్, మండల సర్పంచ్ నాగభూషణ, జ్యోతి రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పనీంద్ర గౌడ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రసాద్, బీజేవైఎం మీడియా కన్వీనర్ నాగేష్, ఓబీసీ మోర్చా మండల కార్యదర్శి లక్ష్మీ ప్రసాద్, తావిరే నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor