తాడిమర్రి (yes9tv )
హిందూపూర్, జూన్ 28: జనసేన పార్టీ నిర్మాణ సారధి సమాచారం కమిటీ కార్యాచరణ సమావేశంలో హిందూపూర్ పార్లమెంట్ నిర్మాణ సారధి సమాచార సేకరణ కమిటీ సీనియర్ నాయకులు తాడిమర్రి మండలం రామాపురం గ్రామానికి చెందిన దూది జయ రామాంజనేయులు ప్రత్యేక గుర్తింపు పొందారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆయన నియామక ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా దూది జయ రామాంజనేయులు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలను అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతానికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి ఎంతో ప్రోత్సాహం అందించారని తెలిపారు. కులాలకు అతీతంగా సమాజాన్ని కలిపే జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ, దళిత వర్గానికి చెందిన తనను రాజకీయంగా ప్రోత్సహించడం పట్ల ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ, నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని జయ రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న దూది జయ రామాంజనేయులు
