ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం: బీజేపీ నాయకులు

*ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం: బీజేపీ నాయకులు*

అనంతపురం, జూన్ 20: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రపంచం ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలనే లక్ష్యంతో అనంతపురం జిల్లా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కడప దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
సదస్సుకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, ఢిల్లీ టీటీడీ చైర్మన్ సుమంత్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సంధిరెడ్డి శ్రీనివాస్, స్టేట్ సెల్స్ కన్వీనర్ చిరంజీవి రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సతీష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, జోనల్ ఇన్‌చార్జ్ తిమ్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, సోమగుట్ట హనుమంతు, మండల అధ్యక్షుడు భూమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రైతులకు సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించడంతో పాటు భూమి సారాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. రసాయన రహిత పద్ధతుల్లో పండించే పంటల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు అందుతుందని పేర్కొన్నారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. రైతులు ఆధునిక సాంకేతికతతో పాటు ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor