కర్నూల్ జిల్లా… ఆలూరు
డేట్ :20-06-2027
*నాకు ఏమైనా జరిగితే వారిదే బాధ్యత: గుత్తి నాగరాజు..*
చిప్పగిరి మండలానికి చెందిన ఓ విలేఖరి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో మానవతా దృక్పథంతో రూ.25 వేల ఆర్థిక సాయం అందించిన అనంతరం తనపై కొందరు యూనియన్ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని APUWJ ఆలూరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గుత్తి నాగరాజు ఆరోపించారు…
ఎన్నికల తర్వాత కూడా తాలూకా, మండల స్థాయి వ్యవహారాల్లో జిల్లా నాయకులు అనవసర జోక్యం చేసుకుంటూ స్థానిక నాయకత్వాన్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదన్నారు..
విలేఖరుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
తనపై దాడి చేయించే కుట్రలు జరుగుతున్నాయనే సమాచారం అందిందని, *ఆలూరుకు చెందిన ఐదుగురు జిల్లా నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.* ఈ విషయాన్ని జిల్లా, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తనకు ఏదైనా అపాయం జరిగితే అందుకు వారే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
తనను రక్షించి న్యాయం చేయాలని, సంబంధిత నాయకుల నుంచి తనకు రక్షణ కల్పించాలని జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి గుత్తి నాగరాజు విజ్ఞప్తి చేశారు…
ఇట్లు
ఆలూరు apuwj వైస్ ప్రెసిడెంట్
గుత్తి నాగరాజు..
