విలువలతో కూడిన విద్యతోనే ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యం….

*విలువలతో కూడిన విద్యతోనే ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యం*

సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, సామాజిక చైతన్యంతో కూడిన విద్యను విద్యార్థులకు అందించినప్పుడే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు.

గుమ్మగట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లెనిన్‌బాబు సారథ్యంలో నిర్వహిస్తున్న “విలువల బడులు” కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు లెనిన్‌బాబు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న లెనిన్‌బాబుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
విద్యార్థులు క్రమశిక్షణ, లక్ష్యసాధనతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. చదువుతో పాటు సమాజం పట్ల గౌరవం, బాధ్యత, సేవాభావం అలవర్చుకుని మంచి వ్యక్తిత్వంతో ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాలవ సన్నన్న, మాజీ కన్వీనర్ గిరిమల్లప్ప, సదాశివ, మాజీ సర్పంచ్ నాగరాజు, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor