తాడిమర్రి( yes9tv )దాడి తోటలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ చంద్రమ్మ
తాడిమర్రి, జూన్ 4: తాడిమర్రి మండలంలోని దాడి తోట గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఐసీడీఎస్ సూపర్వైజర్ చంద్రమ్మ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు విద్యారంగ ప్రవేశాన్ని సూచిస్తూ గ్రాడ్యుయేషన్ ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం సూపర్వైజర్ చంద్రమ్మ మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌష్టికాహార సేవలను వినియోగించుకోవాలని కోరారు.
చిన్నారుల విద్యా ప్రగతికి అంగన్‌వాడీ కేంద్రాలు పునాది వంటివని, బాలల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, కిశోర బాలికలు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
దాడి తోటలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ చంద్రమ్మ..
