సత్యసాయి జిల్లా, హిందూపురం.
ఘనంగా నందమూరి తారక రామారావు 103 వ జయంతి వేడుకలు
హిందూపురం పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. “జోహార్ ఎన్టీఆర్” అంటూ నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు.
తెలుగు జాతి గర్వించదగిన మహానుభావుడు, కోట్లాది మంది గుండెల్లో దైవంగా నిలిచిన మహానటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్‌కు నాయకులు అక్షర నివాళులర్పించారు. “ఏ దేశమేగినా, ఎందుకాలిడినా నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకునే ఆత్మగౌరవాన్ని తెలుగు ప్రజలకు అందించిన మహానేత ఎన్టీఆర్” అని కొనియాడారు. తెలుగు నేలపై ఎంతో మంది నాయకులు పుట్టినా ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయిన నాయకుడు ఒక్కరే అని, ఆ మహనీయుడు ఎన్టీఆర్ అని నేతలు పేర్కొన్నారు.
