పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్సార్‌సీపీ మండిపాటు….

*గౌ|| గుంతకల్ పట్టణ ,మండల పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారం…*🙏🏻

*రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం.* ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే *పెట్రోలు, డీజిల్ , గ్యాస్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ,* అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం జరుగుతోంది.

ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు, రైతాంగం మరియు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు _*గౌ|| శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పెట్రోలు, డీజిల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పార్టీ సమన్వయకర్త వై వెంకటరామ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనగా రేపు 18.05.2026 (సోమవారం) ఉదయం 10:30 గంటలకు గుంతకల్ పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో నిరసన అనంతరం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.*_
📌🙏🏻🙏🏻 కావున ఈ కార్యక్రమానికి హాజరై సమాచారాన్ని సేకరించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
*రేపు అనగా 18-05-2026సోమవారం ఉదయం 10:30గంటలకు*

*MDR ఖలీల్ MBA,LL.B*
*P.రాము*
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు గుంతకల్*

Posted Under AP
Editor