Latest Posts

అరికెర యువతిపై దుర్వ్యవహారం… నిందితుడికి గ్రామస్తుల ‘దేహశుద్ధి’..

కర్నూలు జిల్లా, ఆలూరు

అరికెర యువతిపై దుర్వ్యవహారం… నిందితుడికి గ్రామస్తుల ‘దేహశుద్ధి’

ఆలూరు మండలం అరికేర
గ్రామంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి, ఆమె చేతిని పట్టుకుని లాగుతూ బలవంతం చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఆ మహిళ, వెంటనే తన బంధువులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
విషయం తెలిసిన మహిళ బంధువులు, స్థానికులతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. యువతి పట్ల దుర్వ్యవహారం చేసినందుకు ఆగ్రహానికి గురైన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం అతనికి అరగుండు కొట్టి, చెప్పుల దండ మెడలో వేసి, బట్టలు తొలగించి గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందిందా లేదా అన్నది తెలియరాలేదు. కాగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, ఇలాంటి ఘటనల్లో పోలీసుల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

Posted Under AP
Editor