*ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న రఘు మేడ్జ్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి*
*ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్న రఘు మేడ్జ్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి*
*పి ఎస్ యు, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారి ఏవో కుప్రాకు గారికి వినతి*
*ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు ప్రచారాలు అడ్మిషన్లు చేస్తున్న రఘు మేడ్జ్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారి ఏవో కుప్రాకు గారికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పి.ఎస్.యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగల్లో తొక్కి అకాడమికర్ ప్రారంభం కాకున్న ముందే పట్టణంలోనూ మరియు పరిసర ప్రతి గ్రామానికి వెళ్లి గడపగడప తిరుగుతూ అడ్మిషన్లు సేకరిస్తున్న రఘు మేడ్జ్ పాఠశాలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తు ప్రచార బ్యానర్లతోనూ రంగురంగుల కరపత్రంలో సైనిక్ స్కూల్, నవోదయ, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, ఐఐటి,జేఈఈ,నీట్, ఒలంపియాడ్ వంటి పేర్లతో విద్యార్థులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను వంచన చేస్తున్నారు ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని. డిమాండ్ చేశారు లేనిపక్షంలోన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు నందకిషోర్, గుణవరుణ్, ఏఐఎస్బి నాయకులు మురళి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
