*ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో *కేజీబీవీ* *స్కూల్స్*
నందు సీట్లు పెంచాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువ శాతం రైతాంగంపై ఆధారపడి మరియు కొన్ని ప్రాంతాలలో వలసలకు వెళ్లి జీవనం కొనసాగించే వారు ఎక్కువగా ఉన్నారు. అందువలన బాలికలు చదువుకు దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రతి కేజీబీవీ పాఠశాలలో *50* *సీట్లు* *అదనంగా* కేటాయించాలని విన్నవించడం జరిగింది కార్యక్రమంలో టి.ఎన్.ఎస్.ఎఫ్ సీనియర్ నాయకులు రమేష్ నాయక్, బాణాలు రాజశేఖర్ పాల్గొన్నారు.
