కార్మికులందరికీ “మే” డే శుభాకాంక్షలు 💐💐🌹💐💐
ప్రపంచ 140 వ “మే డే” సందర్బంగా ముదిగుబ్బ పట్టణంలో కార్మికులు నిర్వహించిన మే డే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్. ఈ సందర్బంగా తుమ్మల మనోహర్ కార్మిక సోదర సోదరీమణులకు మే డే శుభాకాంక్షలు తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రామికుల కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంది అని తెలియజేశారు. నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రామికుల చెమట నుంచి కార్మికుల కరిగిన కండల నుంచి రైతు కూలీల రక్తం నుంచి పుట్టిందని తెలియజేయడం వలన తెలుగుదేశం పార్టీ శ్రామికులకు ఇస్తున్న విలువ అర్థమవుతుంది. నాటి నుంచి నేటి దర్శనికత కలిగిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు వరకు శ్రామికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ శ్రామికులకు పని ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ శ్రామికుల అభివృద్ధి మరియు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ ఎన్ డి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంది అని తెలియజేశారు
