ఉరవకొండ లో మే డే సందర్భంగా సిఐటియు కామ్రేడ్ సుందరయ్య గారి భవనం నందు బస్టాండ్ హమాలి ఆఫీస్ ముందు మార్కెట్ యార్డ్ హమాలీ ఆఫీస్ ముందు మూడు ప్రాంతాల్లో సిఐటియు జండా ఆవిష్కరణలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణమూర్తి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశు రంగారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం విడపనకల్ మండల కార్యదర్శి తిమ్మయ్య ఉరవకొండ మండల కార్యదర్శి మురళి సిద్ధప్ప పంచాయతీ కార్మికులు వలి మారెన్న శైలజ రామాంజనమ్మ హమాలీ యూనియన్ నాయకులు బి గోవిందు రాము సుధాకర్ ఎం గోవిందు సంజప్ప ఎస్ఎఫ్ఐ నాయకులు శశివర్మ శివరాజ్ కౌకుంట్ల వెంకటేశులు జయరాములు తదితర కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు బానిసత్వం నుండి విముక్తి కోసం ఎనిమిది గంటల పని హక్కు కోసం పోరాడుతున్న కార్మికుల మీద ప్రభుత్వం కాల్పులు జరిపించి 8 మంది ప్రాణాలు బలికొందన్నారు అక్రమంగా కేసులు పెట్టి అనేక మందిని జైలు శిక్షకు గురి చేశారన్నారు అయినప్పటికీ కార్మికులు ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అనే నినాదంతో వ్యక్తి చాకిరికి విముక్తంగా పని గంటలు 8 గంటలకు సాధించుకోవడం జరిగిందన్నారు అయితే ఎంతోమంది ప్రాణ త్యాగాలతో పోరాటం చేసుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి పది గంటలు పనిని తీసుకురావడం చాలా దుర్మార్గం అన్నారు భవిష్యత్తులో అన్ని వర్గాలు అన్ని రంగాల కార్మికులు ఎనిమిది గంటల పని విధానం కోసం తిరిగి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు సమస్యలు పరిష్కారం కాక వలస పోతున్నారన్నారు ఉపాధి హామీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు పనులు దగ్గర కనీస సౌకర్యాలు లేవు . పనిముట్లు లేవు . రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర లేవు కవులు రైతులకు సిసిఆర్సి కార్లు ఇచ్చి ముందస్తు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు పట్టణాల్లో పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26000 వేల రూపాయలు ఇవ్వాలని హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు రానున్న కాలంలో కార్మిక కర్షక ఐక్యతను కోసం నిరంతరం ఆందోళన పోరాటాలు చేస్తామని మే డే స్ఫూర్తితో ముందుకు పోతామని తెలియజేశారు
ఉరవకొండలో ఘనంగా మే డే వేడుకలు: కార్మిక హక్కుల రక్షణకై పోరాడుతామని నేతల ప్రతిన
