సింహవాహనం పై లక్ష్మీనరసింహుడు …

 

ఉరవకొండ :
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పెన్నహోబిలం గ్రామం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా లో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు సింహవాహన సేవ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.
స్వామివారు సింహవాహనంపై అలంకారభూషితుడై ఆలయ మాడవీధుల్లో విహరించగా, భక్తులు భారీగా హాజరై “గోవిందా గోవిందా” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సింహవాహనం శౌర్యం, ధైర్యం, ధర్మరక్షణకు ప్రతీకగా భావించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఉభయ దారులు కీ!! శే అమిలినేని వెంకటప్ప గారి కుమారులు సురేంద్ర & బ్రదర్స్ SRC,అనంతపురము వారి కుటుంబ సభ్యులు, ధర్మ కర్తల మండలి సభ్యులు,
దేవస్థాన అర్చకులు, సిబ్బంది, పోలిష్ సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor