Latest Posts

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే ఊరుకోము: ఎమ్మెల్యే విరుపాక్షికి జనసేన నేత వెంకప్ప హెచ్చరిక

– కర్నూలు జిల్లా ఆలూరు-పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే ఊరుకోము.. వెంకప్ప హెచ్చరిక..
–ఆలూరులో జనసేన కార్యకర్తల సమావేశం..ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం

ఆలూరు మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకప్ప ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వెంకప్ప మాట్లాడుతూ, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. “మా నాయకుడు పవన్ కళ్యాణ్‌పై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిపై విమర్శలు చేయడం తగదు” అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పర్యటించినట్లు ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నానని, వాటి పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. జనసేన కోఆర్డినేటర్ బోయ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే విరుపాక్షి ఇకపై పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.

Posted Under AP
Editor