తాడిమర్రిలో తప్పని ఎండ తిప్పలు: బస్సు షెల్టర్ లేక ప్రయాణికుల అరిగోస!

తాడిమర్రి (yes9tv)తాడిమరి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ నిర్మాణంపై ప్రయాణికుల ఆవేదన
తాడిమరి మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా బస్సు షెల్టర్ నిర్మించాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు పలుమార్లు అధికారులను విన్నవించుకున్నప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మండల కేంద్రంలో బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులకు సరైన షెల్టర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఎండల తీవ్రత కారణంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే బస్సు షెల్టర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు తాత్కాలికంగా అయినా షెల్టర్ లేదా నీడ ఏర్పాట్లు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించాలని కోరుతున్నారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మండల ప్రజలు మరియు ప్రయాణికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Posted Under AP
Editor